News November 26, 2024

నేషనల్ గేమ్స్‌కు విశాఖ జిల్లా జట్టు ఎంపిక

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మదనపల్లి మండలం, చిన్నతిప్పసముద్రం ZPHSలో ఇంటర్ డిస్ట్రిక్ట్ నెట్ బాల్ టోర్నమెంట్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో విశాఖ జిల్లా జట్టు తూర్పుగోదావరి జిల్లా జట్టుపై విజయం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు గాజువాక మండలం కణితి ZPHS పీడీ నారాయణరావు సోమవారం తెలిపారు. ఈ జట్టు డిసెంబర్ 11న లుథియానాలో జరిగే నేషనల్ స్థాయి నెట్ బాల్ టోర్నమెంట్‌లో ఆడుతుందన్నారు.

Similar News

News October 22, 2025

విశాఖ: అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాలకు క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని విశాఖ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి S.వెంకటేశ్వరరావు కోరారు. అర్హులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 28వ తేది రాత్రి11:59 గంటలలోపు www.dbtyas-sports.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

News October 22, 2025

విశాఖ: వీకెండ్‌లో ప్రత్యేక సర్వీసులు

image

కార్తీక మాసం నేపథ్యంలో ఆర్టీసీ పంచారామ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. విశాఖ ద్వారక బస్ స్టేషన్ నుంచి ప్రతి శని,ఆదివారాల్లో ఈ సర్వీసులు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. లగ్జరీ, డీలక్స్, ఇంద్ర సర్వీసులకు సంబంధించి వేర్వేరుగా ధరలు నిర్ణయించారు. మరిన్ని వివరాలకు డిపోలో సంప్రదించాలని అధికారులు కోరారు.

News October 22, 2025

గంటా శ్రీనివాస్ జోక్యంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి గ్రీన్ సిగ్నల్

image

చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మెట్రో ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.3.23 కోట్లతో నిర్మించే ఈ బ్రిడ్జి నిర్మాణంపై మెట్రో అధికారులు అభ్యంతరం చెప్పారు. దీంతో గంటా సమస్యను వివరించి మెట్రో డిజైన్‌ను బ్రిడ్జి కంటే ఎత్తులో ఖరారు చేయించారు.