News September 11, 2024
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్స్కు దరఖాస్తుల ఆహ్వానం
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (NMMS)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తాన ఓ ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. దరఖాస్తులను ఈ నెల 17వ తేదీ లోపు అందజేయాలన్నారు. ఇతర వివరాలకు మచిలీపట్నంలోని డీఈఓ కార్యాలయం ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
Similar News
News November 25, 2024
మచిలీపట్నం: రైలు కిందపడి దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి
మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిజాంపేటకు చెందిన దంపతులు గోపీకృష్ణ-వాసవి రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భార్య మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన భర్త ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 2011లో వీరికి వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భార్యతో చిన్న చిన్న గొడవలు ఉండటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు గోపీకృష్ణ తెలిపాడు.
News November 25, 2024
మండవల్లి: ‘ఆస్తి కోసం తమ్ముడిని హత్య చేశాడు’
మండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గన్నవరం గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో రోయ్యూరు నగేశ్ బాబు అనే నిందితుడు తన తమ్ముడు రోయ్యూరు సురేశ్, అత్త భ్రమరాంభను కత్తితో దారుణంగా హత్యచేశాడని తెలిపారు. ఈ కేసులో 48 గంటలలో నిందితులను అరెస్ట్ చేసిన కైకలూరు సీఐ రవికుమార్ను, ఎస్ఐను డీఎస్పీ అభినందించారు.
News November 25, 2024
కృష్ణా: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో జూన్ 2024లో నిర్వహించిన బీపీఈడీ 2వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 29లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్లైన్లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.