News February 13, 2025

నేషనల్ మెరిట్ స్కాలర్షిప్‌కు వేమనపల్లి విద్యార్థిని ఎంపిక

image

నీల్వాయికి చెందిన 8వ తరగతి విద్యార్థిని నేహస్విత ఇటీవల నిర్వహించిన ఎన్‌ఎం‌ఎం‌ఎస్ స్కాలర్షిప్ పోటీ పరీక్ష రాసి ఎంపికైంది. నీల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి వరుసగా విద్యార్థులు NMMSకు ఎంపిక కావడం విశేషం. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ వస్తుంది. ఉపాధ్యాయులు బృందం మరియు తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.

Similar News

News October 21, 2025

BHPL: పాఠశాల/కళాశాలలో విద్యార్థినులకు ప్రవేశాలు

image

భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో విద్యార్థినులకు ప్రవేశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొదట ప్రవేశ పరీక్ష రాసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని, మిగిలిన సీట్లకు నిబంధనల మేరకు ప్రవేశములు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కావున.. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

News October 21, 2025

అరకు: 25 ఏళ్లు ఉన్నవారికి ఈ అవకాశం

image

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అక్టోబర్ 24న ఉదయం 10 గంటలకు ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని ప్రిన్సిపల్ డా.నాయక్ తెలిపారు. BSc కెమిస్ట్రీ పాస్, ఫైల్, ఇంటర్, ITI(ఫిట్టర్, ఎలిక్ట్రీషన్), డిప్లమో(మెకానిక్, ఎలిక్ట్రీషన్), టెన్త్ అర్హతతో 25 ఏళ్లు ఉన్న పురుషులు అర్హులన్నారు. ఎంపికైన వారికి విశాఖ స్కిల్ సెంటర్‌లో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పిస్తారన్నారు.

News October 21, 2025

చిత్తూరు: సెల్యూట్.. సీఐ రుషికేశవ

image

కొందరు పోలీసులు చనిపోయినా ప్రజల మనసులో ఎప్పుడు గుర్తుండిపోతారు. ఈ కోవకే చెందిన వారే సీఐ రుషికేశవ అలియాస్ శివమణి. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 2003లో ప్రొబేషనరీ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టి SI, CIగా పలమనేరు, తంబళ్లపల్లె, పెద్దపంజాణి, పుంగనూరు, PTM, గంగవరం, ములకలచెరువు, మదనపల్లెలో పనిచేశారు. 2022 జులై 8న మృతి చెందారు.
#నేడు పోలీసుల అమరవీరుల దినోత్సవం