News October 19, 2024
నేషనల్ హైవే సమస్యలకు చెక్: ఎంపీ మహేష్
ఏలూరు పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారి సమస్యలు అతి త్వరలో పరిష్కరించబడతాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలకు చెక్ పెట్టేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో శుక్రవారం దిల్లీలో సమావేశమయ్యామన్నారు. సమస్యలకు సంబంధించిన అర్జీని ఇచ్చామన్నారు. స్పందించిన NHAI ఛైర్మన్ వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు.
Similar News
News November 9, 2024
ఉండిలో మహిళపై ఏడుగురు లైంగిక వేధింపులు
ఒక మహిళపై ఏడుగురు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉండి మండలంలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తండ్రితో ఉంటోంది. పక్కింట్లో ఉండే యాకోబుతో పాటు మరో ఆరుగురు లైంగికంగా వేధిస్తున్నారని ఆమె శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై ఉండి ఎస్సై నసీరుల్లా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News November 9, 2024
ఏలూరు: దీపం-2 పథకంపై అధికారులతో జేసీ సమీక్ష
ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా పథకంపై జిల్లాలోని గ్యాస్ డీలర్లు, ఆయిల్ కంపెనీ యాజమాన్యాలు, పౌర సరఫరా అధికారులతో శుక్రవారం స్ధానిక గోదావరి సమావేశ మందిరంలో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మొత్తం 6,31,044 మంది బియ్యం కార్డుదారులలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందుటకు అర్హులుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈకెవైసి పూర్తైన తరువాత మాత్రమే అర్హులన్నారు.
News November 8, 2024
భీమవరం: జిల్లాలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు
నవంబర్ 12 నుండి ఆపార్ ఐడి జనరేషన్‌కు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ప్రాధమిక, కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు అపార్ ఐడీ జనరేషన్ అపార్ అవసరమైన ఆధార్ కార్డు డేటా సవరణలకు అన్ని మండలాలు, మున్సిపాలిటీలోనూ గ్రామ, వార్డు మున్సిపాలిటిలోనూ 90 ఆధార్ సెంటర్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.