News April 30, 2024
నేషనల్ హ్యాండ్లూమ్-2023 అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానం

జాతీయ సంత్ కబీర్& నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డు-2023కి రాష్ట్ర ప్రభుత్వం, చేనేత జౌళి శాఖ దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా చేనేత మరియు జౌళిశాఖ అధికారి గోవిందయ్య తెలిపారు. చేనేత రంగంలో విశిష్ట ప్రతిభ, డిజైన్ లో నైపుణ్యం కనబరిచిన వారు మరియు చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన చేనేత కళాకారులకు ప్రతిష్టాత్మక సంత్ కబీర్ &నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డు ఇవ్వబడుతుందని.. మే 20లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News November 18, 2025
జడ్చర్ల: అగ్ని ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే

జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.. వారి వివరాలు పప్పు (ఒడిశా) హరేందర్( బిహార్) అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పప్పున్, సాతి మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 18, 2025
MBNR: పీయూలో “నషా ముక్త్ భారత్ అభియాన్”

పాలమూరు విశ్వవిద్యాలయం విద్యా కళాశాలలో “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి తన సందేశంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మాళవి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అనురాధ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
News November 18, 2025
బాలానగర్: ఫోన్పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.


