News August 2, 2024

నైట్ ల్యాండింగ్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయండి: కలెక్టర్

image

ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ లో రన్ వే ఎక్స్టెన్షన్, విమానాలు రాత్రి సమయంలో ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రన్‌వేలో కల్పించాల్సిన సౌకర్యాలు, కావలసిన నిధుల వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఎయిర్పోర్ట్ డైరక్టర్‌ను ఆదేశించారు. శుక్రవారం ఓర్వకల్ ఎయిర్పోర్ట్‌లోని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఛాంబర్‌లో రన్ వే ఎక్స్టెన్షన్, నైట్ ల్యాండింగ్‌పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

Similar News

News December 10, 2025

100 రోజులు ప్రచారం చేయండి: కలెక్టర్

image

బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే మన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏఎస్పీ హుస్సేన్ పీరాతో కలిసి బాల్య వివాహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా 100 రోజులు నిర్విరామంగా ప్రచారాలు చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 10, 2025

పీజీఆర్‌ఎస్‌ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.