News June 5, 2024

నైతిక విజయం కాంగ్రెస్ దే: నీలం మధు

image

మెదక్ పార్లమెంటు ఎన్నికలలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందినా నైతిక విజయం కాంగ్రెస్ దేనని ఆ పార్టీ అభ్యర్థి నీలం మధు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగా ఒక్కటై బీసీ బిడ్డను ఓడించడానికి కుట్ర చేశాయని ఆరోపించారు. రెండు పార్టీలు అంతర్గతంగా ఒప్పందంతో బీజేపీ అభ్యర్థిని గెలిపించారన్నారు. కాంగ్రెస్ బీసీ బిడ్డకు అవకాశం కల్పిస్తే ఓర్వలేక కుట్రలు పన్నాయని అన్నారు.

Similar News

News December 15, 2025

MDK: ‘లక్ష్యం గట్టిదైతే విజయం బానిస’

image

లక్ష్యం గట్టిదైతే విజయం నీ బానిస అవుతుందని అమెరికాలోని ఫెయిర్ ఫ్యాక్స్ యూనివర్సిటీ డీన్, మోటివేటర్ డా. వీణ కొమ్మిడి అన్నారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ‘అంతర్జాతీయ స్థాయి అవకాశాలు, లక్ష్యాలు, సాధన’ అంశాలపై ఆమె డిగ్రీ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హుస్సేన్ పాల్గొన్నారు.

News December 15, 2025

మెదక్: నాడు గెలిచి.. నేడు ఓడిన దంపతులు

image

మెదక్ మండలం మాచవరం గ్రామపంచాయతీ ఎన్నికపై అందరి దృష్టి ఆకర్షించే విషయం తెలిసిందే. ఇక్కడ గత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా విజయం సాధించిన దంపతులు ఈసారి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో సర్పంచిగా సంధ్యారాణి, వార్డు సభ్యులుగా శ్రీనివాస్ చౌదరి గెలుపొందారు. ఈసారి సర్పంచ్ పదవికి శ్రీనివాస్ చౌదరి, వార్డు సభ్యులు పదవికి సంధ్యా రాణి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఇక్కడ సాంబశివరావు గెలుపొందారు.

News December 15, 2025

MDK: గతంలో పారిశుద్ధ్య కార్మికుడు.. నేడు ఉపసర్పంచ్

image

ఐదేళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడు, ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులు నిర్వహించిన యువకుడు ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నార్సింగి మండలం శేరిపల్లికి చెందిన చెప్యాల విజయ్ కుమార్ గ్రామంలో రెండో వార్డులో పోటీ చేసి 36 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో గత రాత్రి జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికల్లో విజయ్ కుమార్‌ను ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.