News January 9, 2025
నైపుణ్యత గల ఉపాధ్యాయులను తయారు చేయాలి: తుమ్మల

ఖమ్మం జిల్లాలోని డైట్ కళాశాల ద్వారా నైపుణ్యత గల ఉపాధ్యాయులను తయారు చేసి సమాజానికి అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం టేకులపల్లిలో పర్యటించి డైట్ అడ్మినిస్ట్రేటివ్ భవన ఆధునీకరణ, అదనపు సదుపాయాల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. 70 సం.ల్లో అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో విద్యను అభివృద్ధి చేయలేక పోయామని చెప్పారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా కీలకమైందన్నారు.
Similar News
News July 8, 2025
‘రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవాలి’

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం రేషన్ కార్డుదారులందరు ఆయా రేషన్ షాపులలో ఈ-కేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 4,15,905 రేషన్ కార్డులకుగాను 12,03,943 మంది ఉన్నారు. ఇందులో 9,64,236 మంది మాత్రమే ఈ-కేవైసీ చేయించుకున్నారని చెప్పారు. మిగిలిన వారందరూ వెంటనే సమీపంలోని రేషన్ దుకాణాల్లో ఈ-కేవైసీ చేయించాలని సూచించారు.
News July 8, 2025
15 ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్

జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, దీనికి అవసరమైన పటిష్ఠ ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, విద్యా శాఖ, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మధిరలో జి+2 మోడల్‌లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.
News July 8, 2025
‘ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తులు సమర్పించాలి’

పోర్చుగల్‌లో ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తులు సమర్పించాలని జిల్లా ఉపాధి అధికారిణి మాధవి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 21-40 ఏళ్ళు కలిగిన గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, వీరికి 2-5 సం.రాల అనుభవం ఉండాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తు, రెజ్యూమ్‌లను tomcom.resume@gమెయిల్.comకు మెయిల్ చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 9440049937, 9440051452 నెంబర్లకు సంప్రదించాలన్నారు.