News January 23, 2025
నోటిఫికేషన్: కొడంగల్‌లో ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖలో 363 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కొడంగల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 117 పోస్టులు, కొడంగల్ జనరల్ ఆసుపత్రిలో 199 పోస్టులు, కొడంగల్ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 31 పోస్టులు, కొడంగల్ ప్రభుత్వ ఫిజియోథెరపీ కాలేజీలో 16 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. SHARE IT
Similar News
News February 25, 2026
కలెక్టర్ చేతులమీదుగా అక్రిడేషన్ విడుదల

2026 సంవత్సరానికి సంబంధించి జర్నలిస్టు అక్రిడేషన్ కార్డులను కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం పంపిణీ చేశారు. పలువురు జర్నలిస్టులు కలెక్టర్ నుంచి అక్రిడేషన్ కార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
News February 25, 2026
NZB: హిందువులపై దాడి చేసిన వారిని శిక్షించాలి: దినేష్ కులాచారి

రుద్రూర్, బాన్సువాడ, నిజామాబాద్‌లలో హిందువులపై దాడులు చేస్తున్న ముష్కరులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావుతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు జరుగుతున్నాయని, పక్షపాత ధోరణి వీడి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.
News February 25, 2026
పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని TGTWRJC బాలికల, బాలుర జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను ఆమె ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశ్నాపత్రాల భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ, హాల్ టికెట్ల తనిఖీ కట్టుదిట్టంగా చేయాలని సూచించారు.


