News February 11, 2025
నోరు అదుపులో పెట్టుకోండి: పరిటాల సునీత హెచ్చరిక

వైసీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, గోరంట్ల మాధవ్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరించారు. ఆమె మాట్లాడుతూ.. గుంతపల్లి గ్రామంలో వ్యక్తిగత కారణాలతో జరిగిన గొడవను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమ కేసులు పెట్టించిన ప్రకాశ్ రెడ్డి పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అసత్య ఆరోపణలు తగవని హెచ్చరించారు.
Similar News
News October 30, 2025
నెల్లూరు: ఒక్కో హెక్టార్‌కు రూ.25వేల పరిహారం

తుపాను ధాటికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 42 హెక్టార్లలో ఉద్యానపంటలకు నష్టం వాటిల్లిందని ఆ శాఖ జిల్లా అధికారి సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాలు రూపొందించినట్లు చెప్పారు. దెబ్బతిన్న కూరగాయలు, బొప్పాయి పంటలకు హెక్టారుకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో పరిశీలించి ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.
News October 30, 2025
అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల: కలెక్టర్

ఈ నెలలో అన్నమయ్య జిల్లాలో 3.4 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినందుకు నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బందిని కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమంలో 9, 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. భవిష్యత్‌లో వచ్చే తుఫానులకు సిద్ధంగా NOP సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
News October 30, 2025
ఉమెన్స్ వరల్డ్‌కప్‌లో రికార్డు

మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సౌతాఫ్రికా ప్లేయర్ మారిజానె కాప్(44W) నిలిచారు. నిన్న ENGతో సెమీస్‌లో 5 వికెట్లు తీసిన ఆమె, భారత మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి(43)ని అధిగమించారు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో లిన్ ఫుల్స్టన్(39), మేఘన్ షుట్(39), కరోల్ హోడ్జెస్(37), సోఫీ ఎక్లెస్టోన్(37) ఉన్నారు. కాగా నిన్న SFలో మారిజానె కాప్ బ్యాటింగ్‌లోనూ విలువైన 42 రన్స్ చేశారు.


