News October 26, 2024

నోరు పారేసుకోవ‌డంలో సీఎం రేవంత్ రెడ్డిని మించి పోతున్నారు: రాకేశ్ రెడ్డి

image

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు, మంత్రులు నోరు పారేసుకోవ‌డంలో సీఎం రేవంత్ రెడ్డిని మించి పోతున్నారంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. ఆయ‌న ఎక్స్ వేదిక‌గా మాజీ ఎమ్మెల్యే జ‌గ్గా రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్న మ‌హిళ ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. రాను రాను దిగ‌జారుడు మాట‌ల‌తో స‌భ్య స‌మాజం సిగ్గు ప‌డేలా చేస్తున్నారని అన్నారు.

Similar News

News December 10, 2025

వరంగల్: ప్రచారం ముగిసింది.. ప్రలోభాలకు వేలయింది..!

image

జిల్లాలో ప్రచారానికి తెరపడడంతో పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వం మొదలైంది. ప్రధాన పార్టీల నేతలు మందు సీసాలు, మటన్, చీరలు, మిక్సీలు, నగదు పంపిణీకి గుట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ నెల 11వ తేదీ పోలింగ్‌కు అధికారులు 800 బూత్‌లను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. మఫ్టీలో పోలీసులు పర్యటిస్తూ శాంతిభద్రతలకు చర్యలు చేపడుతున్నారు.

News December 9, 2025

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్

image

రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ నెల 11వ తేదీన జరగబోయే తొలి విడత ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, పరిశీలకులను ఆమె ఆదేశించారు.

News December 8, 2025

వరంగల్: పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

image

జీ.పీఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపుకు మొదటి విడత 3వ, రెండవ విడత 2వ ర్యాండమైజేషన్‌ను జిల్లా సాధారణ పరిశీలకులు బాలమాయాదేవి, కలెక్టర్ డా.సత్య శారద సమక్షంలో పూర్తిచేశారు. రెండు విడతల్లో కలిపి 4,543 మంది పి.ఓ., ఓ.పీ.ఓలను పారదర్శకంగా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.