News December 22, 2024
నోరూరించే గోదావరి వంటకాలు..

గోదావరి జిల్లాలు అంటేనే నోరూరించే వంటకాలకు ఫేమస్. అందులోనూ సంక్రాంతి వచ్చేస్తోంది. దీంతో ఆత్రేయపురం పూతరేకులు, మందపల్లి నేతి బొబ్బట్లు, రాజమండ్రి పాలకోవా, బెండపూడి బెల్లంజీళ్లు, రావులపాలెం కుండబిర్యానీ, కాకినాడ గొట్టంకాజా, కత్తిపూడి కరకజ్జం, ముక్కామల పప్పు చెక్కలు, మండపేట గవ్వలు, కోనసీమ నగరం గరాజీలకు ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. మరి మన గోదావరి వంటకాల్లో మీకు బాగా నచ్చిన వంటకం ఏదో కామెంట్ చేయండి.
Similar News
News December 4, 2025
RJY: 13న జాతీయ లోక్ అదాలత్

జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె రాజమండ్రిలో మాట్లాడారు. త్వరితగతిన, తక్కువ ఖర్చుతో సామాన్యులకు న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమన్నారు. రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకునేందుకు కక్షిదారులు ఈ అవకాశాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు.
News December 4, 2025
నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లేవారు నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. చాగల్లు మండలం దారావరం గ్రామానికి చెందిన షైక్ నాగూర్ బేబీ ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో చిక్కుకున్నారు. కలెక్టర్ చొరవ, వికాస సంస్థ కృషి కారణంగా నాగూర్ బేబీ సురక్షితంగా స్వస్థలానికి చేరుకున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమె గురువారం కలెక్టర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
News December 4, 2025
ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: కందుల

ఆంధ్రప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. గురువారం రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాజమండ్రి నగరం పర్యాటకం, సంస్కృతి & వినోద రంగాల్లో మరింత అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.


