News December 22, 2024
నోరూరించే గోదావరి వంటకాలు..
గోదావరి జిల్లాలు అంటేనే నోరూరించే వంటకాలకు ఫేమస్. అందులోనూ సంక్రాంతి వచ్చేస్తోంది. దీంతో ఆత్రేయపురం పూతరేకులు, మందపల్లి నేతి బొబ్బట్లు, రాజమండ్రి పాలకోవా, బెండపూడి బెల్లంజీళ్లు, రావులపాలెం కుండబిర్యానీ, కాకినాడ గొట్టంకాజా, కత్తిపూడి కరకజ్జం, ముక్కామల పప్పు చెక్కలు, మండపేట గవ్వలు, కోనసీమ నగరం గరాజీలకు ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. మరి మన గోదావరి వంటకాల్లో మీకు బాగా నచ్చిన వంటకం ఏదో కామెంట్ చేయండి.
Similar News
News January 23, 2025
తూ.గో: కుంభమేళాకు వెళ్లే భక్తులకు శుభవార్త
ఉమ్మడి తూ.గో. జిల్లా నుంచి కుంభమేళాకు విశేష సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. ఆర్టీసీ, రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 1,4,8 తేదిల్లో కొవ్వూరు, రాజమహేంద్రవరం నుంచి వారం రోజుల యాత్రలో భాగంగా పూరి-కోణార్క్, ప్రయాగ్ రాజ్, కుంభమేళా, వారణసి, బుద్ధగయ, కాశీ తదితదర క్షేత్రాల దర్శనానికి ఒక్కోక్కరికి రూ.10 వేలు టికెట్‌తో మూడు బస్సులను ఏర్పాటు చేశారు. కాకినాడ నుంచి ప్రత్యేక రైలు నడుపుతున్నారు.
News January 23, 2025
అమలాపురం: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై దాడి
అమలాపురం రూరల్ మండలం సవరప్పాలానికి చెందిన దుర్గాప్రసాద్‌పై ముగ్గురు వ్యక్తులు ఇనుప రాడ్డుతో దాడి చేశారు. దీనిపై కేసు నమోదు చేశామని అమలాపురం టౌన్ సీఐ వీరబాబు బుధవారం తెలిపారు. దుర్గాప్రసాద్ బండారు లంక నుంచి ఇంటికి వెళుతుండగా మంగళవారం రాత్రి ఈదరపల్లి వద్ద ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై అడ్డంగా ఉన్నారన్నారు. హారన్ కొట్టడంతో మేము లోకల్ మాకే హారన్ కొడతావా అంటూ స్కూటర్‌ను ధ్వంసం చేసి దాడి చేశారన్నారు.
News January 23, 2025
తూ.గో: స్పా సెంటర్ పై పోలీసులు దాడి
వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు రాజమండ్రి జేఎన్ రోడ్డులో న్యూ ట్రెండ్జ్ బ్యూటీ మ్యూజిక్ స్పా సెంటర్ పై బుదవారం రాత్రి ప్రకాష్ నగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఆరుగురు మహిళలు, ముగ్గురు విటులను స్టేషనుకు తరలించారు. స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బాజీలాల్ తెలిపారు. వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.