News December 22, 2024
నోరూరించే ప.గో జిల్లా వంటకాలు

గోదావరి జిల్లాలు అంటేనే నోరూరించే వంటకాలకు ఫేమస్. అందులోనూ సంక్రాంతి వచ్చేస్తోంది. దీంతో ప.గో జిల్లాలో పిండి వంటకాలకు గిరాకీ మరింత పెరిగింది. అరిసెలు, గవ్వలు, సకినాలు, చక్రాలు, సున్నండలు, పూతరేకులు, కాజాలు వంటివి ఇందులో ముఖ్యమైవని. ఇటు జిల్లాలో నాన్వెజ్ వంటకాలు మరో ఎత్తు. పందెం కోళ్లు, సీఫుడ్కు ఫిదా అవ్వాల్సిందే. మరి మన గోదావరి వంటకాల్లో మీకు నచ్చినది ఏదో కామెంట్ చేయండి.
Similar News
News September 17, 2025
ఈనెల 17 నుంచి జిల్లాలో పోషణ మాసోత్సవాలు: కలెక్టర్

ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాదిగా ఉంటుందని, జిల్లాలో పోషణ మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. మంగళవారం భీమవరంలో కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు అవగాహన కార్యక్రమాలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం అనేది ప్రమాదకరంగా మారిందన్నారు.
News September 16, 2025
సకాలంలో బాల సంజీవిని కిట్లు అందించాలి: జేసీ

బాల సంజీవిని కిట్లను సకాలంలో అంగన్వాడీ కేంద్రాలకు అందేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను జేసీ రాహుల్ ఆదేశించారు. మంగళవారం భీమవరంలో జేసీ ఛాంబర్లో జిల్లా స్థాయి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం మానిటరింగ్ రివ్యూ కమిటీ సమావేశాన్ని సంబంధిత కమిటీ సభ్యులతో నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పోషకాహార సరుకులను నాణ్యతతో నిర్ణీత సమయానికి అందజేయాలన్నారు.
News September 16, 2025
ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: జేసీ

జిల్లాలో ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో ఆక్వా జూన్ సర్వేపై జిల్లాలోని మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఆక్వా జోన్ పరిధిలోనికి తీసుకురావడానికి భీమవరం, ఆకివీడు మండలాల నివేదికలు అందాల్సి ఉందని, మిగతా అన్ని మండలాల్లో సర్వేను పూర్తి చేసి నివేదికలను అందజేయడం జరిగిందన్నారు.