News February 25, 2025
న్యాయం చేయాలంటూ ఎస్పీని కలిసిన తుని మహిళ

తుని కొండవరపు పేటకు చెందిన దళిత మహిళ తనపై నాలుగు రోజుల క్రితం టీడీపీ నేత లావేటి సతీష్ అత్యాచారయత్నం చేశాడని సోమవారం మీడియాతో వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే రాజీపడమని చెప్పారని ఆరోపించింది. స్థానిక నిమ్మకాయల వీధికి చెందిన సతీష్ తన బట్టలు విప్పేందుకు ప్రయత్నించాడని, న్యాయం కోసం సోమవారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు ఆమె మీడియాకు తెలిపింది. దళిత మహిళనైన తనకు న్యాయం చేయాలని విలపించారు.
Similar News
News November 18, 2025
మద్యం తాగుతున్నారా.. డాక్టర్ ఏమన్నారంటే?

అతిగా మద్యం సేవిస్తే చిన్న వయసులోనే తీవ్రమైన మెదడు రక్తస్రావం వచ్చే ప్రమాదం ఉందని US అధ్యయనంలో వెల్లడైనట్లు ప్రముఖ వైద్యుడు సుధీర్ హెచ్చరించారు. భారీగా మద్యం సేవించేవారిలో ప్లేట్లెట్స్ పనిచేయక రక్తం గడ్డకట్టే సామర్థ్యం దెబ్బతింటుందని వెల్లడించారు. ఫలితంగా పెద్ద రక్తస్రావాలు సంభవిస్తాయని తెలిపారు. మద్యం తాగితే ఏకాగ్రత, నిర్ణయాధికారం దెబ్బతింటాయని, అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడమే మంచిదని సూచించారు.
News November 18, 2025
GWL: ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి- నుషిత

గద్వాల జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువే ఎస్సీ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి నుషిత మంగళవారం పేర్కొన్నారు. కొత్త పథకం కింద 5 నుంచి 8వ తరగతి విద్యార్థులు, రాజీవ్ విద్యా దీవెన పథకం కింద 9,10వ తరగతి విద్యార్థులు డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ ఖాతా ఆధార్ తో లింక్ చేసుకోవాలన్నారు.
News November 18, 2025
వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి: నిర్మల్ ఎస్పీ

శీతాకాలం నేపథ్యంలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. బైక్లు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రహదారిపై ఓవర్ టేక్లు చేయకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. సాధ్యమైనంత వరకు రాత్రి, తెల్లవారుజాముల్లో ప్రయాణాలు చేయవద్దన్నారు.


