News May 22, 2024

న్యూజెర్సీ సిటీలో ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి

image

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అమెరికాలోని న్యూజెర్సీ సిటీలో స్వామినారాయణ్ ఆలయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి నారాయణ దేవాలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ స్వామి వారి ఆశీస్సులతో సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు.

Similar News

News February 13, 2025

మోర్తాడ్: జాతీయస్థాయి కబడ్డీకి ఎంపిక

image

మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన కుంట సుశాంక్ జాతీయ స్థాయి సీనియర్ కబడ్డి ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికైనట్లు జిల్లా కబడ్డి కోచ్ మీసాల ప్రశాంత్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారుడు ఎంపికవడంపై జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కార్యవర్గ సభ్యులు పలువురు అభినందించారు. తుది జట్టు ఎంపిక తర్వాత ఒడిషా రాష్టంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు.

News February 13, 2025

NZB: 70 శాతం సీసీ కెమెరాలు పనిచేయడం లేదు: కవిత

image

భద్రత కోసం మహిళలు పోరాటం చేయాల్సిరావడం బాధాకరమని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన మహిళా జాగృతి సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్ల కాలేజీకి వెళ్తే ఇంటికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 70 శాతం పనిచేయడం లేదని ఆరోపించారు.

News February 13, 2025

NZB: పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలు

image

నిజామాబాద్ జిల్లాలో త్వరలో నిర్వహించే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ప్రకటించిన పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని 33 మండలాల్లో 1564 పోలింగ్ కేంద్రాలు, 8,51,770 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు ఓటర్లు 3,97,140 ఉండగా మహిళా ఓటర్లు 4,54,613 మంది, ఇతరులు 17 మంది ఉన్నారు.

error: Content is protected !!