News December 31, 2024

న్యూయర్ వేళ.. కడప ఎస్పీ హెచ్చరికలు

image

నూతన సంవత్సర వేడుకలలో యువకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే తాటతీస్తామని జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత సామరస్యంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. బైకులకు సైలెన్సర్ తీసి పెద్దగా శబ్దం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే బైక్ సిస్టంతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసులకు దయచేసి సహకరించాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

Similar News

News February 7, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.16,040
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.14,757
* 10 గ్రాముల వెండి ధర: రూ.2,670.

News February 7, 2026

పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలి..!

image

కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల ఎన్ఆర్ఈజీఎస్ పనులను ఈ ఆర్థిక సవత్సరంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పనులు మొదలు పెట్టి పురోగతిలో ఉన్న వాటిని మార్చి 15 లోపు పూర్తి చేయాలన్నారు.

News February 7, 2026

నేడు టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

image

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నూతన కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన అధ్యక్షుడిగా భూపేష్ సుబ్బరామిరెడ్డిని అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత ఆధ్వర్యంలో అధ్యక్షుడితో సహా కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.