News November 26, 2024

న్యూయార్క్‌లో ఎంపీ బైరెడ్డి శబరి బిజీ బిజీ

image

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అమెరికా పర్యటన కొనసాగుతోంది. 79వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాల కోసం న్యూయార్క్ వెళ్లిన ఆమె ఈ నెల 18-22 వరకు జరిగిన ఆ సమావేశాల్లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. అనంతరం తన స్నేహితులు, శ్రేయోభిలాషులను కలుస్తున్నారు. న్యూయార్క్‌లోని తెలుగు కుటుంబాలు, టీడీపీ మద్దతుదారులను కలవడం సంతోషంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు.

Similar News

News November 15, 2025

మైనర్ డ్రైవింగ్ తీవ్ర నేరం: కర్నూలు ఎస్పీ

image

మైనర్ డ్రైవింగ్ చట్ట ప్రకారం తీవ్ర నేరమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. 2025 జనవరి–అక్టోబర్ మధ్య జిల్లాలో 675 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలు తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులను, యజమానులను ఆయన సూచించారు. రెండోసారి పట్టుబడితే ₹5,000 జరిమానా ఉంటుందని హెచ్చరించారు.

News November 15, 2025

బాల్య వివాహాలను నిర్మూలించండి: కలెక్టర్

image

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం కర్నూలు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వరకట్న నిషేధం, బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించి జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో వరకట్న నిషేధంపై అధికారులు స్వచ్ఛంద సంస్థల ద్వారా నిరంతరం అవగాహన కల్పించాలన్నారు.

News November 15, 2025

సమాజ పరిశుభద్రత ఎంతో అవసరం: కలెక్టర్

image

ప్రస్తుత సమాజంలో పరిశుభ్రత పాటించే విధంగా ప్రతి ఒకరు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పిలుపునిచ్చారు. శనివారం ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘వ్యక్తిగత, సమాజ పరిశుభద్రత”’ ర్యాలీని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.