News September 26, 2024
న్యూయార్క్‌లో మంత్రి పర్యటన.. ప్రముఖులతో భేటీ
న్యూయార్క్ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమయ్యారు. ప్రపంచ బ్యాంకు సహజ వనరుల పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్‌స్టర్, షెల్ ఫౌండేషన్ సీఈఓ జోనాథన్ బెర్మాన్, పోర్ట్‌ఫోలియో అధిపతి మీరా షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరదలు, కరువు నివారణ చర్యలు, సౌరశక్తి రంగంలో నూతన ఆవిష్కరణలపై జోనాథన్ బెర్మాన్, మీరా షాతో చర్చించారు.
Similar News
News October 15, 2024
విజయనగరంలో విద్యుత్ శాఖ కంట్రోల్ రూం
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్ అన్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూడాలని, అవసరమైన యంత్రాంగం, పరికరాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఎస్ఈ, ఈఈలను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ ప్రమాదాలు గుర్తిస్తే టోల్ ఫ్రీ నెం. 1912 లేదా కంట్రోల్ రూమ్ నెం. 94906 10102 తెలియజేయాలన్నారు.
News October 14, 2024
సిరిమానోత్సవంలో చీకటికి చెక్..!
విజయనగరంలో మంగళవారం జరగబోవు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో లక్షలాది భక్తులు పాల్గోనున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ లైన్లు తగిలి ప్రమాదాలు జరగకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చీకటికి చెక్ పెట్టేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. విద్యుత్, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా జనరేటర్ సహాయంతో వెలిగే విద్యుత్ లైట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
News October 14, 2024
ఘనంగా పైడితల్లి తొలేళ్ల సంబరం
శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరం సోమవారం ఘనంగా జరిగింది. ఊరంతా పండగ శోభను సంతరించుకుంది. పులివేషాలు, కర్రసాము, కత్తిసాము, వివిధ వేషాలతో పట్టణంలో సందడి నెలకొంది. అమ్మవారికి మొక్కులు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. ఘటాలతో, అమ్మవారి నామ స్మరణతో పట్టణం మారుమోగింది. వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి భక్తులు తరలివస్తున్నారు.