News August 5, 2024

న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌ను సందర్శించిన సీఎం రేవంత్

image

అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్న ప్రఖ్యాత న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో పలువురు ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఇతర ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Similar News

News February 26, 2026

HYD: బడా బాబుల ‘కోటల’ గుట్టు రట్టు!

image

మూసీ సుందరీకరణలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు గర్జిస్తున్నా 42 బడా సంస్థల విషయంలో యంత్రాంగం మౌనం వహిస్తోందన్న ఆరోపణలొస్తున్నాయి. అంబర్‌పేటలోని ఇంజినీరింగ్ కాలేజీలు, అత్తాపూర్‌లోని మల్టీప్లెక్స్‌లు, నాగోల్‌లోని ఫంక్షన్ హాళ్ల జాబితా సిద్ధమైనా అవి రాజకీయ నేతల బినామీ ఆస్తులు కావడంతో GOVT ఆచితూచి అడుగులేస్తోంది. హైడ్రా మార్కింగ్ చేసినా పెనాల్టీతో రెగ్యులరైజ్ చేసే రహస్య ఒప్పందాలు జరుగుతున్నట్లు సమాచారం.

News February 26, 2026

మాస్టర్ ప్లాన్ 2050.. ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ ముసుగులో భూదందా!

image

HMDA సిద్ధం చేస్తున్న ‘విజన్ 2050’ మాస్టర్ ప్లాన్ ఇంకా నోటిఫై కాకముందే దానిలోని ‘గ్రీన్ జోన్’, ‘రెసిడెన్షియల్ జోన్’ వివరాలు లీక్ అయ్యాయి. ఏయే ప్రాంతాలు భవిష్యత్తులో పారిశ్రామిక హబ్‌లుగా మారుతాయో ముందే తెలుసుకున్న కొందరు అధికారులు, రాజకీయ నేతలు కలిసి చుట్టుపక్కల వేల ఎకరాలను కారుచౌకగా కొనుగోలు చేశారు. ఈ ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ విలువ దాదాపు ₹5,000 కోట్లకు పైమాటే.

News February 26, 2026

HYD: మూసీ సుందరీకరణ.. నిధుల కోసం ఢిల్లీ బాట!

image

మూసీ పునరుజ్జీవనంపై సర్కారు పట్టుదలతో ఉన్నా, నిధుల వేట సవాలుగా మారింది. రూ.17 వేల కోట్ల మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర బడ్జెట్‌లో ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగేలా కనిపిస్తోంది. సర్వేలు పూర్తయినా, భూసేకరణ, పునరావాసంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావడంతో నిధుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.