News December 30, 2024
న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ
న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. ఆదివారం కనగల్ పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించి మాట్లాడారు. కుటుంబ సమేతంగా ఇళ్లల్లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం, రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు.
Similar News
News January 6, 2025
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని NLG జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖతో పాటు, అన్ని శాఖల అధికారులు ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
News January 6, 2025
NLG: MGU LAW ఫలితాలు విడుదల
నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం లా ఐదు సంవత్సరాల పదవ సెమిస్టర్ (రెగ్యులర్) & 5, 6, 7, 8, 9 సెమిస్టర్ల (బ్యాక్లాగ్) ఫలితాలను విడుదల చేసినట్లు సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. అలాగే మూడు సంవత్సరాల లా డిగ్రీ ఆరవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. వివరాలకు https://mguniversity.in/వెబ్సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
News January 6, 2025
భువనగిరి: KTRకు చామల కౌంటర్.. మీ కామెంట్?
రైతుభరోసాపై KTRట్వీట్‌కు భువనగిరి MP చామల కిరణ్ కౌంటర్ ఇచ్చారు. వరి వేస్తే ఉరి అన్న మీరెక్కడ..? అత్యధికం ధాన్యం కొనుగోలు చేసి చరిత్ర సృష్టించిన మేమెక్కడ..? అని మండిపడ్డారు. రాళ్లు రప్పలకు పెట్టుబడి పేరిట రూ.22 వేల కోట్లు మింగిన BRSతో మా కాంగ్రెస్‌కు పోలికా..? అని ధ్వజమెత్తారు. రైతు భరోసా రూ.12 వేలు, బోనస్ రూ.500 ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని X(ట్విట్టర్)లో పేర్కొన్నారు. MP వ్యాఖ్యలపై మీ కామెంట్..?