News December 30, 2024

న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ 

image

న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. ఆదివారం కనగల్ పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించి మాట్లాడారు. కుటుంబ సమేతంగా ఇళ్లల్లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం, రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు.

Similar News

News January 26, 2025

నల్గొండ: జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 26 నుంచి 4 నూతన పథకాల అమలు ప్రారంభమవుతుందని రాష్ట్ర ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా పథకాల అమలుకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ పథకాల అమలుకై గ్రామ, వార్డుసభలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

News January 25, 2025

నల్లగొండ: రూ.500 కోట్లతో జిల్లా అభివృద్ధి: కోమటిరెడ్డి

image

నల్లగొండ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ఏడాది కాలంలో రూ.500 కోట్లు మంజూరు చేయించి తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు చేపట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. 11లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 11 నీటి ట్యాంకులను నిర్మిస్తున్నామని.. వచ్చే ఏప్రిల్ నుంచి ప్రతిఇంటికి ప్రతిరోజు కృష్ణా తాగునీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News January 25, 2025

తిప్పర్తి: కొండ్ర సైదులు విగ్రహావిష్కరణలో మంత్రి కోమటిరెడ్డి

image

తిప్పర్తి మండల పరిధిలోని తానేదారుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొండ్ర సైదులు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక నేతలు, గ్రామస్థులను ఆప్యాయంగా పలకరించారు.