News December 31, 2024

న్యూ ఇయర్ వేడుకలు.. శ్రీకాకుళం ఎస్పీ సూచనలు

image

● బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్ మద్యం పార్టీలు ఏర్పాటు చేయరాదు● మద్యం దుకాణాలు ఎక్సైజ్ శాఖ విధించిన నిర్ణీత సమయంలో మూసివేయాలి● మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు, సీజ్● అశ్లీల నృత్యాలకు చోటు లేదు. ● వేడుకల్లో మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు● బాణసంచా కాల్చడంపై ఆంక్షలు●  శుభాకాంక్షల పేరుతో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే జైలు శిక్ష

Similar News

News January 13, 2025

శ్రీకాకుళం: ఈ గ్రామానికి 400 ఏళ్ల చరిత్ర

image

సంక్రాంతి అనగా మనకు గ్రామాలు గుర్తుకు వస్తాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలంలోని S.Mపురం గ్రామానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం రాజులకు ఫౌజదారిగా వ్యవహరించిన షేర్ మహమ్మద్ ఖాన్ పేరు ఈ గ్రామానికి వచ్చింది. ఇతను క్రీ.శ 1600 సం. కాలంలో గ్రామంలో కోట, ఏనుగుల ద్వారం, పెద్ద చెరువు, తాగునీటి కోసం 7 బావులను సైతం ఏర్పాటు చేశారు. నేడు అవి శిథిలావస్థలో ఉన్నాయని, వాటిని సంరక్షించాలని స్థానికులు అన్నారు.

News January 13, 2025

శ్రీకాకుళం జిల్లాలో భోగిని జరుపుకోని ప్రాంతాలివే..!

image

తెలుగు పండుగల్లో మొదటిది భోగి. ఈ భోగికి పురణాల గాథలతోపాటు సైంటిఫిక్ రీజన్ ఉంది. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయానంలోకి ప్రవేశించే క్రమంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరగడంతో భోగి మంటలు వేస్తారు. కాగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని గాజులకొల్లివలస, నరసన్నపేటలోని బసివలస, జలుమూరులోని బసివాడ, లింగాలవలస మాత్రం పలు కారణాలతో భోగి మంటలు వేయరు. మీ ప్రాంతాల్లో కూడా భోగి చేయకపోతే కామెంట్ చేయండి.

News January 13, 2025

శ్రీకాకుళం: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.