News December 31, 2024
న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న బాపట్ల కలెక్టర్
విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి విద్యార్థులకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలో నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై కేక్ కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో కలిసి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
Similar News
News January 7, 2025
సంతమాగులూరు: Way2News కథనానికి స్పందించిన మంత్రి లోకేశ్
సంతమాగులూరు మండలంలోని ఏల్చూరులో ఈనెల రెండో తేదీన రోడ్డు ప్రమాదం జరిగి బాలుడికి గాయాలయ్యాయి. ఈ కథనం <<15047387>>Way2News<<>>లో ప్రచురితమైంది. ఈ వార్తకు ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ట్విటర్(X) వేదికగా స్పందించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తన బృందం దానిని పరిశీలించి, సాధ్యమైన సహాయం బాలుడికి చేస్తుందని ట్వీట్ చేశారు.
News January 7, 2025
ప్రకాశం జిల్లా ప్రజలు భయపడకండి: DMHO
బెంగళూరులో HMPV కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి ప్రకాశం జిల్లాకు రానున్నారు. దీంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రకాశం జిల్లా DMHO టి. వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
News January 7, 2025
ప్రకాశం: భయపడుతున్న ఫేక్ లబ్ధిదారులు..!
ఉమ్మడి ప్రకాశంలో జిల్లాలోని ఫేక్ పెన్షన్లపై అధికారులు నిన్నటి నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో కొందరిలో టెన్షన్ నెలకొంది. కొండపి మండలంలో నకిలీ వికలాంగుల పెన్షన్‌దారులను గుర్తించేందుకు ఎంపీడీఓ నేతృత్వంలో డాక్టర్లు పర్యటించారు. వీరి రాకను గమనించిన కొందరు నకిలీ పెన్షన్‌దారులు ఇళ్లకు తాళాలువేసి ఊరెళ్లారని తెలుస్తోంది. మరికొందరు కనిపించకుండా పరారయ్యారని సమాచారం.