News April 24, 2025

పంగులూరులో రోడ్డు ప్రమాదం

image

బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. గురువారం స్థానికుల వివరాల మేరకు.. ఓ కారు కలకత్తా నుంచి తమిళనాడు వెళ్లే క్రమంలో లారీని క్రాస్ చేస్తుండగా లారీ ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 25, 2025

మహబూబ్‌నగర్: 108, 102 అమ్మ ఒడి వాహనాల ఆకస్మిక తనిఖీ

image

MBNR జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో వివిధ 108 వాహనాలను తెలంగాణ రాష్ట్ర ఫ్లీట్ హెడ్ గిరీశ్‌బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో రికార్డులను, పరికరాల పనితీరు, 102 అమ్మ ఒడి సిబ్బంది పనితీరు, వాహన నిర్వహణను పరిశీలించి సేవలను ప్రశంసించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఉమ్మడి MBNR జిల్లా పోగ్రామ్ మేనేజర్ రవి, జిల్లా కోఆర్డినేటర్ ఉదయ్, ఉద్యోగులు పాల్గొన్నారు.

News April 25, 2025

45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రెడ్ అలర్ట్ జారీ

image

TG: రాష్ట్రంలో ఎండలు తీవ్రమయ్యాయి. నిన్న నిజామాబాద్, ADLB, నిర్మల్, MNCLలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా NZMBలోని సీహెచ్ కొండూరులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో 3 రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

News April 25, 2025

సీఎం చంద్రబాబు పర్యటన .. షెడ్యూల్

image

రేపు (శనివారం) CM చంద్రబాబు ఎచ్చెర్లకు రానున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది.☛ 10:00AM విజయవాడ ఏయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో రాక☛11:55AM బుడగట్లపాలెం హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ ☛12:10 PM బుడగట్లపాలెంలో అమ్మవారిని దర్శించుకుంటారు.☛ 1:20 నుంచి బుడగట్లపాలెం ప్రజలతో సమావేశం.☛ 3:25PM – 4:55PM పథకం ప్రారంభ కార్యక్రమం.☛5:00PM తిరిగి బుడగట్లపాలెం హెలిప్యాడ్ నుంచి విశాఖ ప్రయాణం.

error: Content is protected !!