News March 12, 2025
పంగులూరు జాతీయ రహదారిపై ప్రమాదం

బాపట్ల జిల్లా పంగులూరు మండలం రేణింగివరం జాతీయ రహదారి వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వైజాగ్ నుంచి తిరుపతి వెళుతున్న బస్సు డ్రైవర్ నిద్ర మత్తుతో ముందు ఉన్న సిమెంటు లారీని ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉండగా వారిలో నలుగురికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కాళ్లు క్యాబిన్లో ఇరుక్కోవడం వలన ఫ్రాక్చర్స్ అయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Similar News
News October 31, 2025
డాక్టర్స్ స్పెషల్: ఎల్బీస్టేడియంలో టెన్నిస్ టోర్నమెంట్

ఎప్పుడూ రోగులు, వైద్యం అంటూ బిజీ బిజీగా ఉండే వైద్యులు ఈ వీకెండ్ సేదతీరనున్నారు. టెన్నిస్ టోర్నమెంటులో పాల్గొని రిలాక్స్ కానున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు డాక్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డా.అర్జున్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్యులు సందడి చేయనున్నారు.
News October 31, 2025
HYD: రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట జరుగకుండా చర్యలు

పండగలు, ప్రత్యేక రోజుల్లో సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్లకు ప్రయాణికులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఒక్కోసారి రద్దీ ఎక్కువై అదుపుతప్పి తొక్కిసలాట జరుగుతుంది. ఈ ప్రమాదాలు జరుగకుండా రైల్వే శాఖ కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు హోల్డింగ్ ఏరియాలను త్వరలో ఏర్పాటు చేయనుంది. ఇవి అందుబాటులోకి వస్తే తోసుకోవడం, తొక్కిసలాట సమస్యలు ఉండవని అధికారులు చెబుతున్నారు.
News October 31, 2025
NABFINSలో ఉద్యోగాలు

నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీస్ (NABFINS) వివిధ రీజియన్లలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పని అనుభవం ఉన్నవారు, ఫ్రెషర్స్ కూడా దరఖాస్తుకు అర్హులే. టూవీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33ఏళ్లు. వెబ్సైట్: https://nabfins.org/


