News March 12, 2025

పంగులూరు జాతీయ రహదారిపై ప్రమాదం

image

బాపట్ల జిల్లా పంగులూరు మండలం రేణింగివరం జాతీయ రహదారి వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వైజాగ్ నుంచి తిరుపతి వెళుతున్న బస్సు డ్రైవర్ నిద్ర మత్తుతో ముందు ఉన్న సిమెంటు లారీని ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉండగా వారిలో నలుగురికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కాళ్లు క్యాబిన్లో ఇరుక్కోవడం వలన ఫ్రాక్చర్స్ అయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Similar News

News February 12, 2026

KMR: మొదటగా లెక్కించేది పోస్టల్ బ్యాలెట్ ఓట్లే!

image

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. శుక్రవారం ఉదయం 8 గం.లకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటగా ఓటు హక్కు కలిగి ఉండి పోలింగ్ విధుల్లోని సిబ్బంది వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంటింగ్ అధికారులు లెక్కించనున్నారు. జిల్లాలో 385 మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్‌ల వారీగా ఓట్లు లెక్కిస్తారు.

News February 12, 2026

రమణీయం.. బ్రహ్మోత్సవం

image

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్స వాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు గురువారం నీలకంఠుడు భ్రమరాంబ సమేతుడై దశకంఠుడి భుజస్కందాలపై ఊరేగాడు. రావణుడి భుజస్కందాలను అధిష్ఠించిన ఉత్సవ మూర్తులకు ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. రావణవాహనాధీశులైన స్వామి, అమ్మవార్లకు వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.

News February 12, 2026

రేపు వైన్ షాపులు బంద్

image

TG: రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉ.6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకూ మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రేపు ఉ.8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.