News February 19, 2025
పంగులూరు వద్ద ప్రమాదం.. వ్యక్తి మృతి

బాపట్ల జిల్లా పంగులూరు మండలం కొప్పెరపాడు శివారులో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి బైక్ పైనుంచి కిందపడినట్లు సమాచారం. గమనించిన స్థానికులు అతణ్ని వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 11, 2026
ఎల్లుండి టెట్ నోటిఫికేషన్?

TG: రాష్ట్రంలో మరోసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 13న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో TET నిర్వహించారు. ఇప్పుడు రెండో నోటిఫికేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జూన్ రెండో వారంలో పరీక్షలు జరిగే అవకాశముంది.
News April 11, 2026
WTCలో మార్పులు.. ఇక నుంచి 12 జట్లు?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పలు మార్పులు జరిగే అవకాశముంది. 2027 నుంచి మొదలయ్యే WTC సైకిల్‌లో జట్ల సంఖ్యను 9 నుంచి 12కి పెంచాలని ICC వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదించింది. కొత్తగా ZIM, IRE, AFGను చేర్చాలంది. కాగా ప్రస్తుతం కనీసం 2 మ్యాచుల సిరీస్‌ల ఫలితాలు WTC pts టేబుల్‌కి యాడ్ అవుతున్నాయి. ఇక నుంచి సింగిల్ టెస్ట్ సిరీస్‌ల ఫలితాలనూ యాడ్ చేయాలనుకుంటున్నారు. దీనిపై ICC తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
News April 11, 2026
NTR: నేడు 3 మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన APSDMA

జిల్లాలో శనివారం 3 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక X ఖాతా ద్వారా తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. జి.కొండూరు 44.1, ఇబ్రహీంపట్నం 44.1, కంచికచర్ల మండలాలలో 43.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది.


