News January 29, 2025
పంచగ్రామాల సమస్యపై కీలక నిర్ణయం

సింహచలం పంచ గ్రామాల భూ సమస్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు కూటమి ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టింది. కోర్టు కేసుల విత్ డ్రాకు ఇరుపక్షాలు అంగీకరించడంతో వివాదం ముగిసిందని ఎమ్మెల్యే గంట శ్రీనివాసు తెలిపారు. ప్రత్యామ్నాయ భూములను తీసుకునేందుకు ధర్మకర్తలు కూడా అంగీకరించడంతో సింహాచలంలో సమావేశం ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News February 19, 2025
బహుళ పంటల విధానంపై రైతుల్లో చైతన్యం: కలెక్టర్

లాభదాయక సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రకృతి సేద్యానికి, మిల్లెట్లు, బహుళ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామాలల్లో ప్రతి ఇంటి వద్దా కంపోస్ట్ పిట్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల పెంపకం చేసేలా అవగాహన కల్పించాలన్నారు.
News February 18, 2025
విశాఖ: టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య

టెన్త్ క్లాస్ చదువుతున్న కే.సాస మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. అక్కయ్యపాలెం ఎన్. జి.జి..ఓఎస్.కాలనీ ఓ అపార్ట్మెంట్‌లో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుంది. బాలిక సీతమ్మధారలోని ఓ స్కూల్‌లో చదువుతుంది. ఏమైందో తెలియదు గానీ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 18, 2025
బహుళ పంటల విధానంపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలి: కలెక్టర్