News November 27, 2024
పంచగ్రామాల సమస్య.. అశోక్‌తో విశాఖ ఎమ్మెల్యేలు భేటీ

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సింహాచల దేవస్థానం పంచ గ్రామాల భూముల క్రమబద్దీకరణపై అశోక్ తో చర్చించారు. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, పంచకర్ల రమేష్, తదితరులు అశోక్ ను కలిసిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Similar News
News April 10, 2026
VZM: పోషణ్ పక్వాడా కార్యక్రమానికి శ్రీకారం

పోషకాహారంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించే పోషణ్ పక్వాడా కార్యక్రమానికి కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. శుక్రవారం తన ఛాంబర్‌లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం & పోషకాహారం ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
News April 10, 2026
ప్రజల సంతృప్తిలో జిల్లా 4వ స్థానం: కలెక్టర్

జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలక ప్రతిపాదనలపై CM చంద్రబాబు సానుకూలంగా స్పందించారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. అమరావతిలో జరిగిన సమీక్షలో ఈ అంశాలపై చర్చించారని చెప్పారు. ప్రజల సంతృప్తిలో జిల్లా 4వ స్థానం సాధించిందని, విద్యుత్, RTC, రిజిస్ట్రేషన్ల సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారన్నారు. భోగాపురం విమానాశ్రయం నుంచి విజయనగరం వరకు అవుటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారన్నారు.
News April 10, 2026
VZM: ‘ఏక మొత్తంలో పన్ను చెల్లిస్తే 5 శాతం రిబిట్’

ఆస్తి పన్నులను 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఏకమొత్తంలో చెల్లించిన వారికి 5 శాతం రిబేటు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు విజయనగరం నగర పాలక కమిషనర్ బాలస్వామి గురువారం తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్నులు, ఖాళీ స్థలాల పన్నులపై ఏక మొత్తంలో చెల్లించాలనుకునేవారు 50 శాతం రాయితీతో ఏప్రిల్ నెలాఖరు వరకు చెల్లించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


