News March 28, 2025

పంచాంగం ఆవిష్కరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేతుల 2025 ఉగాది పంచాంగన్ని శుక్రవారం ఆయన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. జిల్లా ధూప దీపం నైవేద్యం అర్చకులు రాచర్ల పార్థసారథి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఉపాధ్యక్షులు బీటుకూరి గోపాలాచార్యులు, ప్రధాన కార్యదర్శి రమేష్, గౌరవాధ్యక్షులు, మరిగంటి కొండమాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్, గొంగళ్ళ రవికుమార్, అర్చక బృందం పాల్గొన్నారు.

Similar News

News October 30, 2025

పీఎంశ్రీ నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలి: కలెక్టర్ ప్రావీణ్య

image

సంగారెడ్డి జిల్లాలోని 44 పీఎంశ్రీ పాఠశాలలకు వచ్చిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన ఆమె, పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్ వర్క్‌లను నెల రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News October 30, 2025

తిరుమలలో పుష్పార్చన గురించి తెలుసా..!

image

పవిత్రమైన కార్తీక మాసం శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు. వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి పుష్పాలతో అర్చన చేస్తారు. కనుక దీనిని పుష్పార్చన అని అంటారు. ఈ వేడుక 30వ తేదీ గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగనుంది.

News October 30, 2025

జనగామ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

రైల్వే అధికారులు సికింద్రాబాద్ నుంచి జనగామ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న శాతవాహన ఎక్స్ ప్రెస్ (12713-12714) నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రైలు ఇకనుంచి జనగామ స్టేషన్‌లో ఆగుతుందని SCR స్పష్టం చేసింది. ఈ నెల 30 నుంచి ఈ హాల్టింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.