News March 30, 2025
పంచాంగ శ్రవణంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే

మంచిర్యాలలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులందరికీ ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News April 21, 2025
మా పిల్లలు ఆలయాన్ని ఎంతో ఇష్టపడ్డారు: జేడీ వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ రోజు కుటుంబంతో కలిసి ఢిల్లీలోని అక్షర్‌ధామ్ మందిరాన్ని సందర్శించారు. ‘ఈ అద్భుత ప్రదేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈ ఆలయాన్ని ఇంత గొప్పగా నిర్మించిన ఘనత భారత్‌కు దక్కుతుంది. మా పిల్లలు దీన్ని ఎంతగానో ఇష్టపడ్డారు’ అని టెంపుల్ విజిటర్ బుక్‌లో వాన్స్ రాశారు. కాగా US ఉపాధ్యక్షుడు కుటుంబసమేతంగా 4 రోజులు భారత్‌లో పర్యటించనున్నారు.
News April 21, 2025
మధిర: వడదెబ్బకు సొమ్మసిల్లి వ్యక్తి మృతి

వడదెబ్బకు సొమ్మసిల్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మధిర మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిదానపురం గ్రామానికి చెందిన మేసిపోగు రత్తయ్య(33)మేకలు మేపేందుకు పొలానికి వెళ్లాడు. సోమవారం అధిక ఎండలతో మధ్యాహ్నం ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News April 21, 2025
ద్వారపూడి: కోనసీమ ఏకైక రైల్వే స్టేషన్‌లో సౌకర్యాలు కరవు

కోనసీమ జిల్లాలో ఉన్న ఏకైక ద్వారపూడి రైల్వే స్టేషన్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్‌కు అమలాపురంలో సోమవారం వినతి పత్రాన్ని అందజేసినట్లు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు కొన సత్యనారాయణ పేర్కొన్నారు. మండపేట మండలం ద్వారపూడి రైల్వే స్టేషన్‌లో పలురైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కోరామన్నారు. అమలాపురం బీజేపీ నేత నల్లా పవన్ కుమార్ స్వగృహంలో ఎంపీని కలిసి వినతిపత్రం సమర్పించామని తెలిపారు.