News February 13, 2025
పంచాయతీ ఎన్నికలను సన్నద్ధం కావాలి

గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అధికారులకు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఆదేశించారు. బుధవారం గద్వాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల కోసం నియమించిన స్టేజ్ 1, స్టేజ్ స్టేజ్2 నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక సూచనలు అందించారు.
Similar News
News December 6, 2025
VJA: హిడ్మా ఎన్కౌంటర్.. ఇద్దరు వ్యాపారుల పాత్రపై దర్యాప్తు

హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో విజయవాడలో ఇద్దరు వ్యాపారుల పేర్లు తెరమీదకి వచ్చాయి. వీరు మావోయిస్టుల మద్దతుదారులా? లేక పోలీసుల ఇన్ఫార్మర్లా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పెనమలూరులో పట్టుబడిన మావోయిస్టులతో వీరికి సంబంధాలున్నాయా అనే కోణంలో ఇంటెలిజెన్స్ శాఖ దర్యాప్తును వేగవంతం చేసింది.
News December 6, 2025
టాస్ గెలిచిన భారత్

విశాఖలో సౌతాఫ్రికాతో జరిగే మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 20 వన్డేల తర్వాత టీమ్ ఇండియా టాస్ గెలవడం విశేషం. సుందర్ స్థానంలో తిలక్ వర్మ జట్టులోకి వచ్చారు.
భారత్: జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (C), తిలక్ వర్మ, జడేజా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
News December 6, 2025
4,116 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

RRC నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100. టెన్త్, ఐటీఐలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.rrcnr.org


