News February 14, 2025
పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణ, RO, AROల విధులు తదితర అంశాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల నిర్వహణ, విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు.
Similar News
News December 1, 2025
TG ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

TG: శిఖా గోయల్, CV ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర తదితర IPS ఆఫీసర్లను IAS క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని హైకోర్టు CSకు నోటీసులిచ్చింది. GO 1342 ద్వారా ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడం చట్టవిరుద్ధమని శ్రీకాంత్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జస్టిస్ సూరేపల్లి నంద DEC10 లోపు సమాధానం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు.
News December 1, 2025
అమరావతిలో సచివాలయ టవర్లకు అరుదైన రికార్డ్లు

అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నిర్మాణ దశలోనే ఇవి పలు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటున్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద ‘డయాగ్రిడ్’ నిర్మాణం. దీనివల్ల పిల్లర్ల సంఖ్య తగ్గి, భవనం అద్భుతంగా కనిపిస్తుంది. జపాన్ తర్వాత ప్రపంచంలోనే రెండవ ఎత్తైన సచివాలయ టవర్గా (212 మీటర్లు) ఇది రికార్డు సృష్టించనుంది. ఇది 200 మీటర్ల ఎత్తు దాటిన ఏపీలోని మొదటి స్కైస్క్రాపర్.
News December 1, 2025
WGL: ఏసీబీ అధికారి పేరుతో మోసంచేసే ముఠా అరెస్టు

ఏసీబీ డీఎస్పీ అంటూ ప్రభుత్వ అధికారులను బెదిరించి, వసూళ్లకు పాల్పడుతున్న ఐదుగురి ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. రాచంపల్లి శ్రీనివాస్, నవీన్, రవీందర్, మురళీ, ప్రసన్నలను అరెస్టు చేసినట్లు CP సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ ముఠా 19మంది ప్రభుత్వ అధికారులను బెదిరించి, సుమారు రూ. 50 లక్షలు వసూలు చేసినట్లు సీపీ తెలిపారు. వారి నుంచి 13 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.


