News February 14, 2025
పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణ, RO, AROల విధులు తదితర అంశాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల నిర్వహణ, విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు.
Similar News
News October 19, 2025
ఏలూరులో ఒకరు సూసైడ్

కరెంటు వైరుతో ఓ వ్యక్తి ఆత్మహత్య చెసుకున్న ఘటన ఆదివారం ఏలూరులోని వంగాయగూడెంలో జరిగింది. మృతుడు వంగయాగూడెంనకు చెందిన చంద్రమౌళి(32) సెంట్రింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగించేవాడిని స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 19, 2025
కొత్తగూడెం: మద్యం షాపుల దరఖాస్తుల గడువు పెంపు

బీసీ బంద్, బ్యాంకు బంద్ల కారణంగా దరఖాస్తులు సమర్పించలేని ఔత్సాహికుల విజ్ఞప్తి మేరకు మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు జిల్లా అబ్కారీ అధికారి జానయ్య తెలిపారు. ఈ కారణంగా ఈనెల 23న జరగాల్సిన మద్యం షాపుల డ్రాను ఈనెల 27కు వాయిదా వేసినట్లు చెప్పారు. డ్రాను కొత్తగూడెం క్లబ్లో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
News October 19, 2025
భద్రాచలంలో వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచలం దేవస్థానంలో ఆదివారం శ్రీ సీతా సమేత రామయ్య నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్త జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులు రామయ్య అక్షంతలు స్వీకరించారు. అనంతరం మూలవిరాట్ను దర్శించుకొని, తీర్థప్రసాదాలు తీసుకున్నారు. సెలవు దినం కావడంతో భక్తులు అధికంగా తరలివచ్చారని ఆలయ ఈవో దామోదర్ తెలిపారు.