News February 14, 2025

పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణ, RO, AROల విధులు తదితర అంశాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల నిర్వహణ, విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు.

Similar News

News March 27, 2025

ఖమ్మం: కేంద్రమంత్రికి MP వద్దిరాజు వినతి

image

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర వ్యవసాయ,రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు పామాయిల్ (ఆయిల్ ఫాం) తోటల సాగుకు అనువైన, సారవంతమైనవని మంత్రికి వివరించారు. పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

News March 27, 2025

వికారాబాద్ జిల్లా నేటి కార్యక్రమాలు

image

√ కొడంగల్: నేడు ఉచిత కంటి వైద్య శిబిరం.√ తాండూర్: నేడు ఎల్మకన్నె సహకార సంఘం సర్వసభ్య సమావేశం. కొడంగల్: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం.√బొంరాస్ పేట: నేడు దుప్చర్లలో ఇసుక వేలంపాట. √ దోమ: నేడు దిర్సంపల్లి తైబజార్ వేలంపాట.√బొంరాస్ పేట: నేడు తుంకిమెట్ల తైబజార్ వేలంపాట.√ కొనసాగుతున్న రంజాన్ ఉపవాస దీక్షలు.√ కొనసాగుతున్న కొడంగల్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.

News March 27, 2025

బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తినండి

image

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అల్పాహారం తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. అధిక ప్రొటీన్ ఉండే చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు తినాలి. రాగి, సామలు, కొర్రలతో చేసిన ఇడ్లీలు, దోశలు తింటే లాభాలు ఉన్నాయి. ఇవి తింటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. షుగర్, ఊబకాయం, రక్తహీనత, గుండె జబ్బుల నివారణకు ఇవి మంచి ఆహారం. అధిక ఆకలి సమస్యనూ అధిగమించవచ్చు.

error: Content is protected !!