News April 8, 2025
పంచాయతీ కార్యదర్శుల బదిలీల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి: ఆకుల రాజేందర్

హనుమకొండ జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ పి.ప్రావిణ్యను కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో కలిసి పంచాయతీ కార్యదర్శుల బదిలీల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో బదిలీలు చేయడం సరికాదని కోరారు.
Similar News
News December 1, 2025
‘భూధార్’ కార్డుల కోసం ‘mభూధార్’ యాప్

TG: ఆధార్ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి ప్రత్యేక ID నంబర్తో కూడిన ‘భూధార్’ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. భూముల యాజమాన్య హక్కుల ఆధారంగా రైతులకు అందించనుంది. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఇప్పటికే ‘mభూధార్’ ప్రత్యేక యాప్ను ప్రారంభించింది. స్థానిక ఎన్నికల అనంతరం 2026 JAN నుంచి ఇవి పంపిణీ అవుతాయి. వీటితో భూ వివాదాల తగ్గుదల, సులభ లావాదేవీలు, డిజిటలైజేషన్, పథకాల సక్రమ అమలుకు అవకాశం ఉంటుంది.
News December 1, 2025
విపత్తుల సమయంలో ముందస్తు జాగ్రత్తలపై శిక్షణ: కలెక్టర్

విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్ది అన్నారు. సోమవారం పార్వతీపురంలోని కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపక సేవల శాఖ పరికరాలను ఆయన పరిశీలించారు. విపత్తుల కోసం గ్రామస్థాయిలో వాలంటీర్లను ఏర్పాటుచేసుకొని వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు.
News December 1, 2025
VJA: దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ సీఎం సోదరుడు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బడేటి ధర్మారావు, టీడీపీ రాష్ట్ర నాయకుడు రాంప్రసాద్తో పాటు పలువురు పాల్గొన్నారు.


