News August 7, 2024
పంచాయితీరాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

కలెక్టర్ సృజన బుధవారం విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్, ఉపాధి హామీ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆమె అధికారులతో చర్చించారు. నిర్దేశిత గడువులోపు ఆయా అభివృద్ధి పనులను పూర్తి చేసేలా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News October 22, 2025
కృష్ణా: జగన్ను కలిసిన వైసీపీ నేతలు

తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతలు కొడాలి నాని, పేర్ని నాని, కైలే అనిల్ కుమార్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, రూహుల్లా, అరుణ్ కుమార్ తదితరులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డితో సమగ్రంగా చర్చించారు.
News October 20, 2025
కృష్ణా: ఈ ఆలయం నరకాసురుడి సంహారానికి ప్రతీక..!

చల్లపల్లి మండలం నడకుదురులోని కృష్ణానది తీరాన ఉన్న పృథ్వీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై ఇక్కడే నరకాసురుడిని సంహరించారని ఇతిహాసం. అందుకే ఈ ప్రాంతం ‘నరకొత్తూరు’ నుంచి ‘నడకుదురు’గా మారింది. ఇక్కడి పాటలీ వృక్షం అరుదైనది. దీపావళికి నరకాసురుడి దిష్టిబొమ్మ దహనం చేస్తారు. కార్తికంలో భక్తులు నది స్నానమాచరించి మొక్కులు తీర్చుకుంటారు.
News October 19, 2025
కృష్ణా: దీపావళి వ్యాపారాలపై వరుణుడి ప్రభావం

ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో జిల్లాలో దీపావళి వ్యాపారాలు పూర్తిగా మందగించాయి. పండుగ ముందు రోజే పూజా సామాగ్రి కొనుగోలు కోసం మార్కెట్కు రావాల్సిన ప్రజలు వర్షం కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. పూలు, పండ్లు, ప్రమిదలు, ఇతర పూజా సామాగ్రి కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు నిరాశకు గురయ్యారు. వర్షం ఆగకపోతే పండుగ రోజు కూడా వ్యాపార నష్టం తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.