News September 29, 2024

పంచాయితీ ఓటర్లలో మహిళా ఓటర్లే అధికం

image

KMM: గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాను జిల్లా అధికారులు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 8,52, 879 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 4,39,808, పురుషులు4,13,048 మంది,థర్డ్ జెండర్ 23 మంది ఉన్నారు. కాగా పురుషుల కంటే మహిళా ఓటర్లు 26,760 మంది అధికంగా ఉన్నారు. జిల్లాలో 589 గ్రామపంచాయతీలో 5,398 వార్డుల ఓటర్ల జాబితాను ప్రకటించారు.

Similar News

News October 9, 2024

దసరా స్పెషల్.. HYD – KMM మధ్య బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా TGSRTC ఈరోజు నుంచి 11 వరకు హైదరాబాద్ – ఖమ్మం మధ్య స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరి రామ్ తెలిపారు. ఖమ్మం – హైదరాబాద్ మార్గంలో నాన్ స్టాప్ షటిల్ సర్వీసులు నడపుతున్నట్లు చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకు వెళ్లే మహాలక్ష్మి ప్రయాణికుల కోసం LB నగర్ నుంచి ఎక్కువ బస్సులు ఉంటాయన్నారు.

News October 9, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
∆} పలు శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News October 9, 2024

కొత్తగూడెం: ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు టీచర్లుగా ఎంపిక

image

కరకగూడెం మండల పరిధిలోని తాటిగూడెం గ్రామ పంచాయతీ విప్పచెట్టు గుంపునకు చెందిన రామటెంకి హనుమంతరావు, జిమ్మిడి రాధ, జిమ్మిడి లీల ప్రవీణ టీచర్లుగా ఎంపికయ్యారు. చిన్న గ్రామం నుంచి ముగ్గురు టీచర్లుగా ఎంపికవడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చొప్పలలో తోలేం మౌనిక ఎస్.జి.టి టీచర్‌గా ఎంపికయ్యారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.