News January 11, 2026
పంచె కట్టు నచ్చట్లేదు.. భర్తకు విడాకులిచ్చేస్తా!

భోపాల్‌లో ఫ్యామిలీ కోర్టుకు ఒక విచిత్రమైన కేసు వచ్చింది. భర్త పౌరోహిత్యం చేస్తూ కష్టపడి చదివించి తన భార్యను SI చేశారు. తీరా ఆమె పోలీస్ ఉద్యోగం సంపాదించాక ఇప్పుడు భర్త నుంచి విడాకులు కావాలని కోర్టుకెక్కారు. భర్త ధోతీ కుర్తా ధరించడం, పిలక ఉంచుకోవడం తనకు నచ్చడం లేదని అది తన హోదాకు అవమానంగా ఉందని వాదిస్తున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది.
Similar News
News April 14, 2026
పెరిగిన మిర్చి రేటు.. రైతులకు అదృష్టం

TG: ఈ ఏడాది మిర్చి రైతులను అదృష్టం వరించింది. అన్ని రకాల మిర్చి ధరలు భారీగా పెరిగాయి. తాజాగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సాధారణ రకం తేజా మిర్చి క్వింటా రూ.21వేలు, ఏసీ మిర్చి రూ.21,580 పలికింది. చైనా నుంచి ఆర్డర్లు పెరగడంతో డిమాండ్ అధికమైనట్లు వ్యాపారులు చెబుతున్నారు. కాగా టమాటా మిర్చి, ఎల్లో మిర్చి ధరలు రూ.40-50వేలు పలికిన <<19251332>>విషయం<<>> తెలిసిందే.
News April 14, 2026
దివ్యాంగులకు శుభవార్త.. కొత్తగా లక్ష పింఛన్లు!

TG: రాష్ట్రంలోని దివ్యాంగులకు శుభవార్త. కొత్తగా లక్ష మందికి పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వీరయ్య వెల్లడించారు. 40 శాతం వైకల్యం ఉన్నవారికి అవసరమైన అడ్వాన్స్‌డ్ పరికరాలను ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఇప్పటికే దివ్యాంగులకు తొలి విడతలో 4,500 ఇందిరమ్మ ఇళ్లను, 2వేల స్కూటీలను ఫ్రీగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
News April 14, 2026
భయంకరమైన వ్యసనం.. సొంత రక్తాన్నే ఇంజెక్ట్ చేసుకుంటున్నారు

భోపాల్(MP)లో యువత భయంకర వ్యసనం బారిన పడుతున్నారు. మత్తు కోసం తమ రక్తాన్ని బయటకు తీసి మళ్లీ శరీరంలోకి ఎక్కించుకుంటున్నారు. JAN నుంచి ఇలాంటి 5 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీన్ని ‘బ్లడ్ కిక్’ అంటున్నారు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, సెప్సిస్, హెపటైటిస్, నరాలు దెబ్బతినడం, రక్తం గడ్డకట్టడం తదితర సమస్యలొస్తాయి. డిప్రెషన్, తనకు తానే గాయపర్చుకునే లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.


