News November 18, 2024

పంటకాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

image

మనుబోలు గ్రామానికి తూర్పున ఉన్న మలుగు కాలువలో సోమవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, కాకి చొక్కా ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం నీటిలో పడి చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎస్ఐ రాకేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 18, 2024

నెల్లూరు: సివిల్స్ పరీక్షకు ఉచిత శిక్షణ

image

UPSC నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు నెల్లూరు జిల్లా నుంచి అర్హతగల BC, SC, ST అభ్యర్థులకు విజయవాడ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నెల్లూరు జిల్లా BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబరు 24 తేదీ లోపు BC స్టడీ సర్కిల్ నెల్లూరు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News November 18, 2024

ఆన్‌లైన్ మోసాల పట్ల  అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి 85 ఫిర్యాదులు అందాయని, వాటి సమస్య పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News November 18, 2024

నెల్లూరు: ‘ఎక్కువ రేట్లకు మద్యం అమ్మితే చర్యలు’

image

నెల్లూరు జిల్లాలో బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సై‌జ్ డిప్యూటీ కమిషనర్ టీ.శ్రీనివాసరావు వెల్లడించారు. జిల్లాలో అధిక ధరలకు మద్యం విక్రయాలపై ఆయన స్పందించారు. వ్యాపారులు MRP కన్నా ఎట్లక్కువ రేకు మద్యం అమ్మితే రూ.5లక్షల ఫైన్ విధిస్తామన్నారు. షాపుల్లో ధరల బోర్డ్ ఏర్పాటు చేయాలన్నారు. వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే 9440902509, 8374684689 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.