News November 18, 2024
పంటకాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
మనుబోలు గ్రామానికి తూర్పున ఉన్న మలుగు కాలువలో సోమవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, కాకి చొక్కా ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం నీటిలో పడి చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎస్ఐ రాకేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 13, 2024
జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ వర్షం కారణంగా వాయిదా
రేపు నెల్లూరులో జరగాల్సిన జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ వర్షం కారణంగా వాయిదా వేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షం కారణంగా పాడైనా ట్రాక్ & ఫీల్డ్ ఈవెంట్స్ కోర్ట్ లు తిరిగి సిద్ధం చేస్తున్నామన్నారు. శనివారం జరగవలసిన ఈవెంట్స్ ఆదివారానికి వాయిదా వేసినట్లు వారు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా పోలీస్ సిబ్బంది, మీడియా గమనించగలరని కోరారు.
News December 13, 2024
చిల్లకూరు మండలంలో పొంగి పొర్లుతున్న వాగులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నిన్న కురిసిన భారీ వర్షాలకు చిల్లకూరు మండలంలోని పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని నాంచారమ్మపేట నుంచి పారిచర్ల వారి పాలెం గ్రామం మధ్యలో ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వాగు ప్రభావితం తగ్గేవరకు అటువైపు వెళ్లే వాహనదారులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు.
News December 13, 2024
గూడూరు: డాక్టర్ వేధిస్తున్నారంటూ ఫిర్యాదు
వాకాడు మండలం నిడిగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ వైద్యాధికారి వేధిస్తున్నారంటూ పలువురు మహిళా ఉద్యోగుల ఆరోపించారు. ఈ మేరకు వారు గురువారం సాయంత్రం గూడూరు డీఎస్పీతోపాటూ విజయవాడలోని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌కు లికిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితుడిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.