News March 11, 2025

పంటలకు సాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఈరోజు ఉదయ సముద్రం బ్యాలెన్స్ రిజర్వాయర్‌ను ఆమె సందర్శించారు. రబిలో సాగులో ఉన్న పంటలకు సాగునీరు అందటం లేదని వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. రైతులను తప్పుదోవ పట్టించి దుష్ప్రచారాలు చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

Similar News

News January 3, 2026

నల్లగొండలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు

image

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వాల్ పోస్టర్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు మానవ నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనే కారణమని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, “నో హెల్మెట్ – నో పెట్రోల్” నినాదాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని తెలిపారు.

News January 3, 2026

NLG: మంత్రి కోమటిరెడ్డికి అల్లు అరవింద్‌ శుభాకాంక్షలు

image

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ సాగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు పూర్తి అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.

News January 3, 2026

NLG: నకిలీ బంగారం ముఠా గుట్టురట్టు.. నిందితుల అరెస్ట్

image

తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఏడుగురి అంతరాష్ట్ర సభ్యుల ముఠాను నల్గొండ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ కె.శివరాం తెలిపారు. వారి నుంచి రూ.1.5 లక్షల నగదు, 5 సెల్‌ఫోన్లు, అరకేజీ నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.