News January 25, 2025

పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ధారణ: కలెక్టర్ 

image

2025-26 కు సంబంధించి వివిధ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను నిర్ధారించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ సమావేశం ఏలూరులో నిర్వహించారు. వివిధ పంటలు, పాడిపశువుల పెంపకానికి, చేపల పెంపకానికి సంబంధించి పెంచిన రుణపరపతి వివరాల ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీకి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News February 13, 2025

వరంగల్: తగ్గిన మక్కల ధర.. పల్లికాయ ధరలు ఇలా!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కల ధర మళ్లీ తగ్గింది. మంగళవారం రూ.2,370 పలికిన మక్కలు(బిల్టీ) ధర బుధవారం మరింత తగ్గి రూ.2,355కి చేరింది. ఈరోజు మరింత తగ్గి రూ.2,350కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే.. క్వింటా సూక పల్లికాయ ధర రూ.6,410 పలకగా.. పచ్చి పల్లికాయ రూ.4,900 పలికిందని పేర్కొన్నారు.

News February 13, 2025

వైట్‌హౌస్‌లో పిల్లలతో అధ్యక్షులు

image

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన ‘వైట్‌హౌస్’కు ఎలాన్ మస్క్ తన చిన్న కుమారుడిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎంతో ప్రతిష్ఠాత్మక ప్రదేశంలో కొన్నేళ్లుగా అధ్యక్షులు, అధికారుల పిల్లలు సందడి చేయడం కామన్ అయిపోయింది. 2009లో ఒబామా ఇద్దరు కూతుళ్లతో, 1994లో బిల్ క్లింటన్ కూతురు చెల్సీ, 1978లో జిమ్మీ కార్టర్ తన కూతురు అమీతో, 1963లో కెనడీ తన కొడుకుతో కలిసి వైట్‌హౌస్‌లో సందడిగా గడిపారు.

News February 13, 2025

గౌలిదొడ్డి: JEEలో గౌలిదొడ్డి విద్యార్థుల ప్రభంజనం

image

RR జిల్లా గౌలిదొడ్డి గురుకుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులు JEE అడ్వాన్స్ పరీక్షలో ప్రభంజనం సృష్టించారు. 99.03 పర్సంటైల్ సాధించి మణిదీప్ అనే విద్యార్థి చరిత్ర సృష్టించాడు. మరోవైపు చరణ్ తేజ్, తేజస్విని, రామ్‌చరణ్, శ్రీనివాస్, భాను తేజ, నేహాలత, నిహారిక టాప్ ర్యాంకులు సాధించినట్లు రెసిడెన్షియల్ అధికారులు తెలిపారు. ఒకే పాఠశాల నుంచి ఇంత మంది టాప్ ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందన్నారు.

error: Content is protected !!