News November 21, 2024
పంటల బీమా రైతులకు రక్షణ కవచం: జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
పంటల బీమా రైతులకు రక్షణ కవచంలా ఉంటుందని, బీమాపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురంలోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో క్రాప్ ఇన్సూరెన్స్‌పై జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ (డీఎల్ఎంసీ) సమావేశాన్ని నిర్వహించారు. పంటల బీమా పథకం, రబీ 2024- 25, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News December 1, 2024
ATP: చింతలాయపల్లిలో ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి
అనంతపురం (D) యాడికి మం. చింతలాయపల్లిలో ఆదివారం విషాదం ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రామకృష్ణ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. రామకృష్ణ, రామాంజనేయులు ఇద్దరూ ట్రాక్టర్లో గ్రామ శివారులో పునాది రాళ్లు తీసుకురావడానికి వెళ్లారు. అక్కడ లోడ్ చేస్తున్న సమయంలో ట్రాక్టర్ ఉన్న పళంగా ముందుకొచ్చి రామకృష్ణపై దూసుకెళ్లింది. దీంతో మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News December 1, 2024
అనంత: ముగ్గురు మృతి.. ఐఫోన్ పంపిన SMSతో పోలీసుల అలెర్ట్
విడపనకల్లు వద్ద జరిగిన విషాద ఘటన అందరినీ కలిసివేసింది. బ్యాంకాక్ విహారయాత్రకు వెళ్లి తిరిగి బెంగళూరు నుంచి బళ్లారి వెళ్తున్న సమయంలో కారు చెట్టును ఢీకొని ముగ్గురు మృతిచెందారు. కాగా, ప్రమాదం జరిగాక మృతుల ఐఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు SMS వెళ్లింది. మెసేజ్ రాగానే GPS ఆధారంగా ప్రమాద స్థలాన్ని కనుగొని బళ్లారి నుంచి బయలుదేరారు. తమ వాళ్లు ఆపదలో ఉన్నారంటూ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
News December 1, 2024
ఎయిడ్స్ దినోత్సవం ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రంలో కలెక్టర్ టీఎస్ చేతన్ ర్యాలీని ప్రారంభించారు. ఆదివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా వైద్యాధికారి మంజు వాణి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎయిడ్స్ నియంత్రణ ర్యాలీని విద్యార్థులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులు, ఉద్యోగులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.