News February 5, 2025

పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య: ASF CI

image

పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య చేసుకున్న ఆసిఫాబాద్ మండలం బొందగూడలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్రం పోషయ్య(55) పదెకరాల్లో పత్తి సాగు చేశారు. పంట దిగుబడి రాకపోవడంతో రోజూ బాధపడుతుండేవాడు. సోమవారం మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

Similar News

News February 8, 2025

నందిగాం: తమ్ముడి చితికి అక్క అంత్యక్రియలు

image

నందిగం మండలం హరిదాసు పేట గ్రామంలో శుక్రవారం తమ్ముడి మృత దేహానికి అక్క అంత్యక్రియలు నిర్వహించిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన కణితి. సుధాకర్ (24) అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. తన తండ్రి మూడు సంవత్సరాల కిందట మరణించారు. తల్లి కంటి చూపు సమస్యతో బాధపడుతుంది.  భార్య విడాకులు తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సోదరి కృష్ణవేణి తమ్ముడు సుధాకర్‌కు దహన సంస్కారాలు చేసింది. 

News February 8, 2025

నల్గొండ: ఉచిత శిక్షణ.. ఆపై ఉద్యోగం

image

స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతీయువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం కల్పిస్తామని సంస్థ డైరెక్టర్ లక్ష్మీ ఓ ప్రకటనలో తెలిపారు. అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ), కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్, టూ-వీలర్ సర్వీసింగ్, సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు.

News February 8, 2025

27 ఏళ్ల తర్వాత BJP జెండా ఎగరేస్తుందా?

image

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో తేలిపోనున్నాయి. దేశ రాజధానిపై తన జెండా ఎగిరేయడానికి దాదాపు 3 దశాబ్దాలుగా BJP ఎదురు చూస్తోంది. AK చేసిన యమునాలో విషం, రామాయణం వ్యాఖ్యలను ఆ పార్టీ గట్టిగానే తిప్పికొట్టింది. ఆప్‌ది అవినీతి ప్రభుత్వమనే విమర్శలతోనూ ఇరకాటంలో పెట్టి పోటాపోటీగా తలపడింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు 27ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. దీనిపై మీ కామెంట్.

error: Content is protected !!