News February 5, 2025
పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య: ASF CI

పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య చేసుకున్న ఆసిఫాబాద్ మండలం బొందగూడలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్రం పోషయ్య(55) పదెకరాల్లో పత్తి సాగు చేశారు. పంట దిగుబడి రాకపోవడంతో రోజూ బాధపడుతుండేవాడు. సోమవారం మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
Similar News
News February 8, 2025
క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం అమలుకు రూ.2.16 కోట్లు: జేసీ

జాతీయ క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలో వాయు కాలుష్యం నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. వాయు కాలుష్య నియంత్రణ అమలుపై శుక్రవారం సమీక్షించారు. ఏలూరు నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలంలో పెద్ద ఎత్తున మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. వాయు కాలుష్య నియంత్రణకు రూ 2.16 కోట్లు కేటాయించారన్నారు.
News February 8, 2025
శ్రీ సత్యసాయి జిల్లా మహిళలకు గుడ్‌న్యూస్

శ్రీ సత్యసాయి జిల్లాలోని మహిళలకు రూడ్ సెట్ శుభవార్త చెప్పింది. ఈ నెల 28వ తేదీ నుంచి మహిళలకు కుట్టు మెషీన్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. జిల్లా మహిళలకు శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ వద్ద ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
News February 8, 2025
శివరాత్రికి అఖండ-2 ఫస్ట్ లుక్?

బోయపాటి డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా అఖండ-2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే మహాకుంభమేళాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం నుంచి బాలయ్య ఫస్ట్ లుక్‌ను ఈ నెలాఖరున విడుదల చేస్తారని సమాచారం. ఈ మూవీలో సంయుక్తా మేనన్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.