News August 31, 2024

పండగలా పింఛన్ల పంపిణీ

image

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పింఛన్ పంపిణీ జోరుగా సాగుతోంది. ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నారు. ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లాలో 2,84,358 మందికి గానూ 2,41,351 మందికి, సత్యసాయి జిల్లాలో 2,68,079 మందికి గానూ 1,99,592 మందికి పింఛన్ సొమ్ము అందజేశారు. అనంతపురం జిల్లాలో 84.88%, సత్యసాయి జిల్లాలో 74.45% పంపిణీ పూర్తయింది.

Similar News

News September 8, 2024

అనంతపురం జిల్లాలో యువతి హత్య

image

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో హత్య కలకలం రేపింది. వడ్డుపల్లి కాలువ గట్టు సమీపంలో సుమారు 22 ఏళ్ల వయసున్న యువతి తలపై గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్యచేశారు. అటుగా వెళ్తున్న గొర్రెల కాపరులు మృతదేహాన్ని గుర్తించి ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకున్న పరిశీలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 8, 2024

హౌరా నుంచి యశ్వంతపూర్ వరకు రైలు పొడిగింపు

image

హౌరా నుంచి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం వరకు నడుస్తున్న వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు (22831/32)ను యశ్వంతపూర్ వరకు పొడిగించారు. ఇది హౌరా నుంచి ధర్మవరం వరకు యథావిధిగా నడుస్తుంది. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయానికి రాత్రి 9:30 గంటలకు చేరుకుని హిందూపురం, యలహంక(స్టాపులు) మీదుగా యశ్వంత్‌పూర్‌కి రాత్రి 12:15కు చేరుకుంటుంది. తిరిగి యశ్వంత్‌పూర్‌లో ఉదయం 5కు బయలుదేరి ప్రశాంతి నిలయానికి ఉదయం7:53కి చేరుకుంటుంది.

News September 7, 2024

శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇనాయతుల్లా

image

శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంహెచ్.ఇనాయతుల్లాను నియమిస్తూ ఎఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. ఆయనను హిందూపురంలోని తన నివాసంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇనాయతుల్లా మాట్లాడుతూ.. తనకు ఈ గుర్తింపు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.