News February 23, 2025

పండుగలు సామరస్యంతో జరుపుకోవాలి: KMR ఎస్పీ

image

మత సామరస్యం, సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. వచ్చే నెల 2 రంజాన్ మాసం ప్రారంభమవడంతో కలెక్టర్ లో శనివారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని మసీదుల వద్ద శాంతి భద్రతలను పోలీసు యంత్రాంగం పర్యవేక్షిస్తుందని తెలిపారు. పండుగ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని చెప్పారు.

Similar News

News March 17, 2025

జియ్యమ్మవలసలో ఏనుగులు గుంపు సంచారం

image

జియ్యమ్మవలస మండలం నందివాని వలస, తోటపల్లి, సింగాణపురం గౌరీపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి చెరకు, అరటి తోటల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయవద్దని, రైతులు పొలాలకు వెళ్లొద్దని సూచించారు. 

News March 17, 2025

చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

image

చంద్రుడిపై పరిశోధనలు చేపట్టే చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-2లో 25 KGల బరువు ఉన్న రోవర్ ‘ప్రజ్ఞాన్’ను జాబిల్లిపైకి తీసుకెళ్లగా, చంద్రయాన్-5లో 250 కేజీల రోవర్‌ను తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని జపాన్ సాయంతో నిర్వహిస్తామన్నారు. ఇక జాబిల్లిపై ఉన్న మట్టి నమూనాలను తీసుకొచ్చేందుకు 2027లో చంద్రయాన్-4 మిషన్‌ను ప్రయోగిస్తామని చెప్పారు.

News March 17, 2025

నరసరావుపేట: 10వ తరగతి విద్యార్థులకు డీఈవో సూచనలు

image

సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరాలని డీఈవో చంద్రకళ సూచించారు. జిల్లాలోని 128 పరీక్ష కేంద్రాలలో 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ శాఖ 144 సెక్షన్ అమలు చేస్తుందన్నారు. అత్యవసర సమయాలలో విద్యార్థులు 100 ఫోన్ కు సమాచారం ఇవ్వాలన్నారు.

error: Content is protected !!