News June 3, 2024
పంథిని వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఐనవోలు మండలం పంథిని గ్రామంలో రెండు ట్రాక్టర్లను ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 11, 2024
WGL: నిన్నటితో పోలిస్తే పెరిగిన మిర్చి ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నిన్న తేజ మిర్చి క్వింటాకు రూ.18,000 పలకగా, నేడు రూ.18,500కి పెరిగింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14,800 ధర రాగా.. నేడు రూ.15,500కి ఎగబాకింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.16,000 ధర రాగా నేడు కూడా అదే ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు.
News September 11, 2024
GOOD NEWS: వరంగల్‌లో పెరిగిన పత్తి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర రెండు రోజులతో పోలిస్తే ఈరోజు భారీగా పెరిగింది. మార్కెట్‌లో సోమ, మంగళవారాలు క్వింటా పత్తి ధర రూ.7,700 పలకగా నేడు రూ.7,800 అయిందని మార్కెట్ అధికారులు తెలిపారు. ధరలు పెరగడం రైతులకు కొంత ఊరట లభించినట్టయింది. మరింత ధరలు పెరగాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.
News September 11, 2024
వరంగల్ మీదుగా 12 స్పెషల్ రైళ్లు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా అక్టోబర్ 16 నుంచి 20 వరకు అప్ అండ్ డౌన్ రూట్లో 12 రైళ్ల సర్వీసులను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జబల్పూర్, ఇటార్సీ, నాగ్పూర్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు చెప్పారు.